ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ లకు ఊహించని షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ లపై సీఐడీ కి ఫిర్యాదు అందింది. ఈ మేరకు రోజా, ధర్మాన కృష్ణదాస్ లపై ఆత్యా- పాత్యా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.

ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ తదితర కార్యక్రమాలు స్పోర్ట్స్ వస్తువుల కొనుగోలు పేరుతో 350 కోట్లు ఆడిట్ లో లేకుండా ఖర్చు చేస్తారని ఫిర్యాదు చేసింది ఆత్యా- పాత్యా అసోసియేషన్. సాప్ చైర్మన్ గా పని చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.