ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది – పవన్ కళ్యాణ్‌

-

జనసేన పార్టీ చీఫ్‌, మంత్రి పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందన్నారు. సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుందని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని వివరించారు పవన్‌ కళ్యాణ్‌.

Implementation of election promises has started said Pawan Kalyan

16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేశారని… ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం అన్నారు. సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ.. మూడో సంతకం అని… ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకమంటూ జనసేన పార్టీ చీఫ్‌, మంత్రి పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ – అయిదో సంతకం అని వివరించారు జనసేన పార్టీ చీఫ్‌, మంత్రి పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news