క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంకు లోక్ సభ, రాజ్య సభ సభ్యులు హాజరు కానున్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు జగన్. క్యాంపు కార్యాలయంలో 12 గంటలకు ఎంపీలతో సమావేశం కానున్నారు జగన్ మోహన్ రెడ్డి.

ఇక నిన్న మండలి సభ్యులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. అటు మెగా డీఎస్సీ అంటూ టీడీపీ మెగా మోసానికి పాల్పడుతోందని వైసీపీ మండిపడింది. ’25 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పారు. తొలి సంతకంతో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. అందులో 6,100 పోస్టులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే’ అని వైసీపీ ట్వీట్ చేసింది.