ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య

-

ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య జరిగింది. అనంతపురంలోని గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆలూరు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి లక్ష్మీనారాయణను దుండగులు లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ దాడిలో లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Congress leader brutally murdered near Guntakal railway bridge in Anantapur

ఇక ఈ సంఘటన పై వైస్ షర్మిల స్పందించారు. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. లారితో ఢీ కొట్టి,వేట కొడవళ్ళతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుందన తెలిపారు. ఈ ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. లక్ష్మీ నారాయణ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news