వివేకా కేసు డీల్ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా టెన్షన్ !

-

కడప సెంట్రల్ జైలు కేంద్రంగా వివేకా హత్యకేసులో వరుస విచారణలు చేస్తున్న సిబిఐ బృందంలో ఒక అధికారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొద్ది రోజుల నుండీ వరుసగా విచారణ చేస్తున్నారు. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ కేంద్రంగా ఈ సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిన్న వివేకా డ్రైవర్ దస్తగిరివల్లిని సిబిఐ అధికారులు విచారించారు. మొన్న వివేకా వంటమనిషి లక్ష్మీదేవి, స్వీపర్ లక్ష్మీ, మరొక చెప్పుల దుకాణదారుడు మొత్తం ముగ్గురిని విచారించారు.

ఈ విచారణలో కీలక వ్యక్తులను ఇప్పటి వరకు విచారించారు. అయితే విచారణకు వస్తున్న కొంత మంది విషయంలో మాత్రం ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఆసక్తి రేగుతోంది. దానికి కారణం కడప జిల్లా పులివెందుల లో చెప్పులు అమ్ముకునే వాళ్ళు కావడమే. ఈ చెప్పుల షాప్ ల వాళ్లకి వివేకా హత్యకు ఏమి సంబంధం ఉందా ? అని అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ముందుగా మున్నా అనే చెప్పుల షాపు ఓనర్ ను చాలా రోజుల పాటు విచారించారు. ఆ షాపులో పని చేసే భాస్కర్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు విచారించారు. అసలు చెప్పుల షాపుల వాళ్ళను ఎందుకు విచారిస్తున్నారని జిల్లాలో చర్చలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news