AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 100 రకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాద ఇచ్చారు. ఏ ఇంట్లో అయినా… అల్లుడికి మంచి మర్యాద దొరుకుతుంది. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లిన అల్లుడికి మర్యాద ఇవ్వడం సహజం. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 100 రకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాద ఇచ్చారు.
ఆషాడం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టారు అత్తామామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వివాహమై ఆషాడ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండివంటలతో భోజన ఏర్పాట్లు చేయడం చోటు చేసుకుంది. అత్తగారు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
https://x.com/TeluguScribe/status/1822521452798541883