టీడీపీ మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉచిత సలహాలు ఇస్తున్నారు. విద్యుత్ అక్రమాలు పై విచారణ చేయాలని అంటున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ట్రూ అప్ చార్జీల భారం ప్రజలు మోస్తారని యనమలకు ఎవరు చెప్పారో చెప్పాలి. గత ప్రభుత్వం లో అదాని చేసుకున్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలి. అదానీ పోర్ట్ లకు సంబంధించి కాంట్రాక్ట్ లు కూడా చంద్రబాబు రద్దు చేయాలి.
ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు ఎర్పాటు చేసి రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన చేయాలి. రాష్ట్రంలో అదానీకి భయపడి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కాకినాడ పోర్ట్ కువెళ్ళి పవన్ కళ్యాణ్ షిప్ ను కూడా సిజ్ చేయాలని చెప్పాడు. కొన్ని సంవత్సరాల నుండి బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. మిగిలిన పోర్ట్ లలో కూడా బియ్యం అక్రమ రవాణా జరిగుతున్నాయి. ఎందుకంటే మిగిలిన పోర్ట్ లు అదానీ అండర్ లో ఉన్నాయి.. అందుకే పవన్ కళ్యాణ్ అక్కడ కు వెళ్ళడం లేదు. అదానీ అంటే పవన్ కళ్యాణ్ కు భయం అని సీపీఐ రామకృష్ణ తెలిపారు.