ఆన్ లైన్ ఆర్డర్ లో గంజాయి తరలింపు..!

-

డ్రై ఫ్రూట్స్.. ఆన్ లైన్ ఆర్డర్ మాటున గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకున్నారు పోలీసులు. విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో 64 ప్యాకెట్లలో 122 కేజీలు పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన పై డీసీపీ అజితా వేజిండ్ల మాట్లాడుతూ.. డ్రై ఫ్రూట్ అని కొరియర్ బుక్ చేసుకున్నారు. అనుమానిత పార్సెల్ గా కొరియర్ సంస్థ మాకు సమాచారం ఇచ్చింది. ఇచ్చిన సమాచారంతో కేస్ దర్యాప్తు చేశాం. బీహార్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ గంజాయి కొరియర్గా బుక్ చేసుకున్నట్టు గుర్తించాం.

ఒడిసా లోని మాచ్ ఖండ్ నుంచి ఈ గంజాను ఢిల్లీ కి కొరియర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న 4 గురు నిందితులను పట్టుకున్నాం. గంజాయి రవాణా లో రైల్వేస్టేషన్, బస్ కాంప్లెక్స్ దగ్గర నిఘా పెంచాం. అల్లూరి జిల్లా దగ్గర ఉండటం వల్ల అక్కడ నుంచి నగరంలోకి గంజాయి వస్తుంది. వాహనాల తనిఖీలు పెంచాం. కొరియర్ లో అడ్రస్స్ సరిగ్గా ఇవ్వక పోవడం నెంబర్ ఇవ్వకపోవడం లాంటి అంశాలు ఉంటే వెంటనే పోలీస్ దృష్టి కి ఇవ్వాలని కొరియర్ సంస్థలను కోరుతున్నాం అని డీసీపీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news