టీడీపీ తిట్లు.. వైసీపీకి ఆశీర్వాదాలు : మంత్రి పెద్ది రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. మాటకు మాట అన్నట్టు వైసీపీ నేతలు చంద్రబాబు ఆరోపణలపై ప్రతిదాడికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సీఎం జగన్ ను ఎంత తిడితే జగన్ కి అంత ఆశీర్వాదం అన్నారు. గతంలో వైసీపీ సాధించిన సీట్ల కంటే రానున్న ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అసలు చంద్రబాబుకు అభ్యర్థులు ఉన్నారా..? అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత తన పార్టీలోకి తీసుకుంటున్నాడని సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news