స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టీస్ అంటే ఏపీ గుర్తుకొస్తుంది : సీఎం జగన్

-

విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సామాజిక చైతన్యవాడగా విజయవాడ కనిపిస్తోంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టి అంటే అమెరికా గుర్తుకొస్తుంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టీస్ అంటే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం గుర్తుకొస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అంటరానితనం, ఆదిపత్య భావజాలం కనిపిస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే ఆయన భావాలకు నిలువెత్తురూపంగా కనిపిస్తాడు. ఈ విగ్రహం పేదల హక్కులకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాడు.

దళిత వర్గాలకు, అల్ప సంఖ్యాలకు, తమ గొంతు వినిపించలేని అట్టడుగు వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని.. రిజర్వేషన్లు కల్పించాలని కారకులు అంబేద్కర్ గారు. దళితులు నిలబడగలిగారంటే కారణం అంబేద్కర్ గారి స్పూర్తి అని చెప్పడానికి గర్వపడుతున్నానని తెలిపారు. ప్రతివాడలో అంబేద్కర్ విగ్రహం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా అణచివేసిన వర్గాల్లో జన్మించిన చదువుకునే వర్గాల వారందరి కంటే గొప్పగా చదువుకొని మేధావి అయిన వ్యక్తి అంబేద్కర్. 

Read more RELATED
Recommended to you

Latest news