కాపులను బీసీలో చేర్చడం…పవన్ బాధ్యతే – దాడిశెట్టి రాజా

-

పవన్… కాపుల ఓట్లు గంపగుత్తుగా కూటమికి వేయించారు… ఇప్పుడు కాపుల్ని బీసీలో చేర్చడం డిప్యూటీ సీఎం పవన్ బాధ్యత అన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. కాకినాడలోని తునిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా..అనంతరం మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండటానికి మాకు ఇబ్బంది లేదు, కొత్తా కాదు..2010, నుంచి 2019 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నామన్నారు.

daadi shetty raja slams pawan kalyan

ఇప్పుడు మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంటామని తెలిపారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. కేంద్రం కాపుల్ని బీసీల్లో చేరుద్దామని ఉత్తర ప్రత్యుత్తరాలు పంపుతుంది… వీకర్ సెక్షన్లో చేర్చాలా ఎఫ్ కోటాలో చేర్చాలా అని కేంద్రం రాష్ట్రాన్ని అడిగిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, పవన్ చిత్తశుద్ధితో కాపులకు న్యాయం చేయాలని కోరారు. కేంద్రం సానుకూలంగా ఉంది కాబట్టి రాష్ట్రం ఒత్తిడి తేవాలి..రిజర్వేషన్ కల్పిస్తే కాపులందరూ బాగు పడతారని వెల్లడించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా..
లేదంటే కూటమి ప్రభుత్వం కాపులకు వెన్నుపోటు పొడిచినట్టేనంటూ ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news