వయోవృద్దులు, వికలాంగులకు టీటీడీ శుభవార్త అందింది. 23వ తేది మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు. ఆన్ లైన్ లో నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్ విడుదల చేసింది టిటిడి. లక్కిడిఫ్ విధానంలో పోందే ఆర్జిత సేవా టికెట్ల కోసం రేపు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
ఎల్లుండి ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల విడుదల చేయనున్నారు. ఇక ఎల్లుండి మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల చేయనున్నారు. 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేయనున్నారు.
23వ తేది ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు. 23వ తేది మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు. 24వ తేది ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు. 25వ తేది ఉదయం 10 గంటలకు తిరుమల,తిరుపతిలో వసతి గదులు కోటా విడుదల కానుంది. టిటిడి వెబ్ సైట్ www.tirupatibalaji.ap.gov.in బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.