ఏపీ లో త‌గ్గిన క‌రోనా వ్యాప్తి : నేడు 222 కేసులు 2 మృతి

ఆంధ్ర ప్ర‌దేశ్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి గ‌తంలో కంటే కాస్త త‌గ్గింది. ఆంధ్ర ప్ర‌దేశ్ లో గ‌డిచిన 24 గంట‌ల‌లో 222 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే ఇద్ద‌రు క‌రోనా మ‌హమ్మారి బ‌రి న ప‌డి ప్రాణాలు కొల్పోయారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ఇప్ప‌టి వ‌ర‌కు 14,423 మంది క‌రోనా వైర‌స్ బ‌రిన ప‌డి మృత్యు వాత ప‌డ్డారు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ లో నేటి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,50,860 కి చేరుకుంది. అలాగే ఈ రోజు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 275 కోలుకున్నారు.

corona cases | కరోనా కేసులు
corona cases | కరోనా కేసులు

దీంతో పాటు రాష్ట్రంలో ఇంకా 2,560 యాక్టివ్ కేసు లు ఉన్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. అయితే రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గ లేద‌ని అధికారులు తెలిపారు. వైర‌స్ ను ఎదుర్కొవ‌డానికి త‌ప్ప‌కుండా జ‌గ్ర‌త్త లు పాటించాల్సిందే న‌ని తెలిపారు. అలాగే జ‌న స‌మూహాలు ఉన్న చోటు కి వెళ్తే త‌ప్ప‌కుండా మాస్క్ శాని టైజ‌ర్ ల‌ను వాడ‌ల‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ ప‌ట్ల ఏ మాత్రం అజాగ్ర‌త్త గా ఉన్నా.. వైర‌స్ బారిన ప‌డే అశకాశం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.