తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు వాయు’ గండం‘ ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా తమిళనాడు కోష్టల్ ఏరియాతో పాటు, రాయలసీమ, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా చెన్నై నగరంతో పాటు పరిసర జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. చెన్నైకి ఆగ్నేయంగా దాదాపు 200 కిలోమీటర్లు మరియు పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం పొంచి ఉంది. శుక్రవారం (నవంబర్ 19) ఉదయం సమయానికి అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను పుదుచ్చేరి-చెన్నై మధ్య దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో గంటకు 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుదల ఉంటుందని ఐఎండీ అంచనా. ఈ ప్రాంతంలో కఠినమైన వాతావరణం మరియు సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉన్నందున, మత్స్యకారులు వచ్చే 24 గంటల్లో సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చిరించారు. ఐఎండీ హెచ్చిరికల నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం అన్ని చర్యలు తీసుకున్నారు.
ముంచుకొస్తున్న వాయు’గండం‘ .. రేపు తీరం దాటనున్న వాయుగుండం.
-