తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి..!

-

తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణాలను సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవంటూ ప్రభుత్వం లిస్టు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా విశాఖ-అనకాపల్లి హైవేలో నిర్మించిన వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ కార్యాలయాలను లీజుకు ఇచ్చిందని, నిర్మాణాల కూల్చివేత కక్ష సాధింపేనని వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు.

తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతను ఖండించారు. ప్రభుత్వం ఇలా పని చేయకూడదన్నారు. వైసీపీ కార్యాలయానికి భూమిని 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నామని చెప్పారు. కుప్పకూలడం పర్వాలేదని, కానీ నిర్మాణ ప్రక్రియ సాగించాలని చెప్పారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై కోర్టులో సోమవారం ధిక్కరణ దాఖలు చేస్తామని అంబటి హెచ్చరించారు. మరోవైపు ఇవాళ మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కి ప్రమాదం తప్పింది. పులివెందులలో కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news