టీడీపీ ఎమ్మెల్యేలు ఊర కుక్కలు – నారాయణ స్వామి

-

అసెంబ్లీలో డిప్యూటీ సిఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు కుక్కల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు అన్న నారాయణ స్వామి…ఊరకుక్కల మాదిరిగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రెండో రోజు కూడా చంద్రబాబు అరెస్ట్‌ చుట్టూ రచ్చ జరుగుతోంది.

Deputy CM Narayana Swamy's controversial comments in the Assembly
Deputy CM Narayana Swamy’s controversial comments in the Assembly

స్కిల్ స్కాం అంశాన్ని అజెండాలో స్వల్ప కాలిక చర్చ లో పెట్టింది ఏపీ ప్రభుత్వం. అయితే.. చంద్రబాబుపై కేసు ఎత్తేయకుండా చర్చ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ పార్టీ సభ్యులు. చంద్రబాబు అరెస్టు ఎత్తేయాలని వాయిదా తీర్మానం పై పట్టుబడుతున్నారు టీడీపీ సభ్యులు. దీంతో ఆగ్రహించిన డిప్యూటీ సిఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు కుక్కల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిరికిపందల్లా…వెధవల్లా…దద్దమ్మల్లా టీడీపీ నేతలు చర్చ నుంచి పారిపోతున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news