కాకినాడ డీఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. మైనింగ్,
అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు రవీంద్రనాథ్ రెడ్డి పై అభియోగాలు
ఉండటంతో వెంటనే విచారణకు ఆయన ఆదేశించారు. డిప్యూటీ సీఎం పేరు చెప్పి అధికారులకు
రవీంద్రనాథ్ ఫోన్ చేస్తున్నట్లు దృష్టికి రావడంతో పాటు ఫిర్యాదులు అందడంపై ఆయన స్పందించారు. రవీంద్రనాథ్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని
అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. తన పేరు, కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే
కఠిన చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
కాగా అటవీ శాఖ అధికారిగా మూడు రోజుల క్రితమే రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే
మైనింగ్ శాఖకు సంబంధించిన వాహనాల విషయంలో పలు ఆంక్షలు విధించారు. డిప్యూటీ సీఎం
కల్యాణ్ పాటు ఆయన పేషీలో పని చేసే ఉన్నతాధికారులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని మైనింగ్, అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి రవీంధ్రనాథ్ బెదిరించారని పవన్ కల్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారం పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.