సమగ్ర కులగణన కు తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే, తాజాగా.. ఈ సమగ్ర కులగణన విషయంలో మరో కీలక ముందడుగు వేసింది. కులగణనకు
శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవో జారీ
చేసింది.
సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ తాజాగా సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే రాష్ట్రంలోని ప్రజలందరి వాస్తవ
స్థితి, గతులు, వారి వివరాలను శాస్త్రీయంగా సేకరించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక,
ఆర్థిక, విద్య, ఉపాధి, ‘రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించడానికి వీలుగా ఈ
కులగణనను చేపట్టనున్నారు.