డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…బిగ్ స్కెచ్ వేశారు. 2.45 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సాలిడ్, లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ – SLRM వర్క్ షాపులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే చెత్తే సంపద అవుతుంది… పనికి రాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుందని తెలిపారు.
శ్రీనివాసన్ గత రెండు దశాబ్దాలుగా SLRM ప్రాజెక్టు మీద పని చేస్తున్నారని.. పిఠాపురంలో తొలిసారిగా SLRM ప్రాజెక్టు చేపట్టనున్నామన్నారు. ప్రజలూ SLRM ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచేందుకు మాస్టర్ ట్రైనర్సును సిద్దం చేస్తామని… SLRM ప్రాజెక్టును నా కార్యాలయంలో.. మా పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తామని వివరించారు. SLRM ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాల్టీలకు ఆదాయం వస్తుందని… SLRM ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే రూరల్ ప్రాంతంలో ఏడాదికి రూ. 2600 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. 2.45 లక్షల మందికి రూ. 9 వేల జీతం ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు అని తెలిపారు.