వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో జగన్, అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్‌పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. అప్పుడు తనను కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని అందులో పేర్కొన్నారు.
ఇక అటు రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కి చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవనం అమరావతి పరిధిలో ఉన్నందున సిఆర్డిఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు ఇచ్చారు.