విశాఖ ఉక్కుకు కేంద్ర సాయంపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ట్వీట్

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ప్యాకేజీ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మోదీ దృక్పథం.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో బలమైన స్తంభాలలో ఒకటిగా ఉంటుందని అన్నారు.

“1966 లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమృత రావు, వేలాది మంది త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. వారి రక్తం, కన్నీళ్లు నేడు తెలుగువారి గుర్తింపుకు పునాది వేసింది.

ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు కొత్త ఆశలు సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రంలో మన ప్రభుత్వం, విశాఖ ఉక్కు కర్మాగారం మనుగడ సాగించడమే కాకుండా అభివృద్ధి చెందుతుంది. తెలుగువారి గర్వానికి నిదర్శనంగా నిలుస్తుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా” అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

 

Read more RELATED
Recommended to you

Latest news