అభివృద్ధి పనుల వల్లనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది : సీఎం చంద్రబాబు

-

అభివృద్ధి పనుల వల్లనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా నీతి అయోగ్ రిపోర్ట్ పై ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే చివరికీ బాధపడాల్సింది ప్రజలే అన్నారు. ఆర్థిక పరిస్థితిని చూసి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పవచ్చు. అభివృద్ది పనులపై నిధులు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. 

అనారోగ్యంతో ఉంటే ఇంట్లో అందరికీ ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్రంలో వైసీపీ గత ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించింది. అప్పులు చేసి చేసి పనులు చేస్తే ఇబ్బందులు వస్తాయి. లాభాలు వచ్చినా తెచ్చిన అప్పులకే పోతాయి. అప్పులు చేస్తే.. తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదు అని తెలిపారు. గత సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందని తెలిపారు. ఏరంగం చూసినా రాష్ట్ర పరిస్థితి బాలేదన్నారు. తాను వచ్చాక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news