ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసుల తీరు సరిగాలేదు అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో 150 మందికి నోటీసులిచ్చారు. అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలకు మేం అండగా ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేం తోడుగా ఉంటాం. సోషల్ మీడియా కార్యకర్తలు,వైసీపీ నాయకుల పై జరుగుతున్న దాడుల పై DCPకి వినతిపత్రం ఇచ్చాం. తక్షణమే అక్రమ కేసులు, దాడులు ఆపాలి అని అవినాష్ అన్నారు.
ఇక ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అనేక అబద్ధపు ప్రచారాలు చేసింది. ఇప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోంది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి.. విజయవాడలో కేసులు పెడుతున్నారు. 90 మంది మహిళలకు జరిగిన అన్యాయం పై ప్రశ్నిస్తే తప్పా. ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరడం తప్పా. కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే ఛలో అసెంబ్లీ చేపడతాం. హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టేస్తేరా అని ప్రశ్నించారు.