నగరంలోని వరద బాధితులను ఆదుకోవటం ప్రతీ ఒక్కరి భాధ్యత. పెద్ద మనసుతో ఒక కోటీ పది లక్షల సహాయం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు అని దేవినేని అవినాష్ అన్నారు. యాభై వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఇంటి, ఇంటికీ పంపిణీ చేస్తున్నాం. ఈ వరదలకు టీడీపీ పార్టీ, చంద్రబాబు వైఫల్యం కారణం కాదా అని ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు మాని పాలనపై దృష్టి పెట్టాలి.
ఇప్పటికే వరద నష్ట ప్రభావం ప్రజలపై వుంది. గెలుపు ఓటములుతో సంబంధం లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్నాం. 100 రోజుల కూటమి అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు తప్ప చేసిందేమీ లేదు. కృష్ణలంకకు రిటైనింగ్ వాల్ లేకపోతే సగం విజయవాడ మునిగిపోయేది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ కుటుంబం లక్ష రూపాయలు పైగా నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోషల్ మీడియా ప్రచారం చేసుకునే పనిలో ఉన్నాడు. రిటైనింగ్ వాల్ నిర్మించిన జగన్ కు ఎప్పటికీ రుణ పడి వుంటామని ప్రజలు చెబుతున్నారు. మంత్రులే అధికారులను తిడుతున్నారు అంటే టిడిపి పాలన ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.