రెండున్నర దశాబ్దాలు టీడీపీలో పనిచేసిన ఉమా కొద్ది రోజుల తర్వాతైనా పార్టీ లైన్ లోకి వస్తారని భావిస్తున్నాను. ఉమా పార్టీ కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం. నా టార్గెట్ గా ఉమా పని చేస్తే తగిన సమయంలో ఉమాకి సమాధానం చెబుతాన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఉమా వ్యవహారాలు అన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయి. ఉమా, బొమ్మసాని కలిసి పనిచేయటం ఎందుకు ? నేను కూడా కలిసి ముగ్గురం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పని చేస్తాం.
ఉమాకు టికెట్ ఇచ్చినా నేను నా వర్గంతో పని చేయటానికి సిద్దంగానే ఉన్నాను. ఉమా వద్దని చెప్పినా చంద్రబాబు చెబితే చేస్తాం. నేను పార్టీలో పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాను.ఎవరు ఏం చేసినా చివరికి టీడీపీ గూటికే చేరుకోవాలి. బొమ్మసాని సుబ్బారావు నా అన్న, ఆయన్ని ఇవాళ కలిశాను.నన్ను పక్క నియోజక వర్గం వెళ్ళమని పార్టీ చెబితే సిద్దం అని చెప్పాను. టీడీపీ శ్రేణులపై ఉద్దేశ పూర్వకంగా కేసులు నేను ఎప్పుడు పెట్టించ లేదు. పార్టీ, ప్రభుత్వం నుంచి వచ్చిన లిస్ట్ ప్రకారం కేసులు పెట్టారు.నేనేం తప్పు చేయలేదు. నాకు ఏ కేసులు పెట్టినా భయం లేదు, చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.