తిరుమలలో పాపపై దాడి చేసినవి ఈ చిరుతలు కాదు.. అందుకే విడిచిపెట్టేశాం: డీఎఫ్‌వో

-

కొంతకాలం క్రితం తిరుమల నడకదారిలో వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో చిన్నారి మృతి చెందడం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చిన్నారి మృతితో టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అలిపిరి నడకమార్గంలో చిరుత పులులను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఐదారు చిరుతలను పట్టుకున్నారు.

అయితే బంధించిన చిరుతల్లో రెండు ఆ చిన్నారిపై దాడి చేయలేదని అందుకే వాటిని అడవిలో విడిచిపెట్టామని తిరుపతి డీఎఫ్‌వో సతీష్‌ తెలిపారు. చిరుత దాడిలో మృతిచెందిన బాలిక డీఎన్‌ఏ రిపోర్టును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ సంస్థ విడుదల చేసినట్లు చెప్పారు. ఆ నివేదిక ప్రకారం దాడి చేయలేదని తెలియడంతో రెండు చిరుతలను విడిచిపెట్టామని వివరించారు.

చిన్నారిపై దాడి అనంతరం టీటీడీ, అటవీశాఖ నాలుగు చిరుతలను బోనులో బంధించాయి. వాటి నమూనాలనూ పరీక్షకు పంపారు. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం రెండు చిరుతలు దాడి చేయలేదని తేలడంతో ఒక చిరుతను గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో , మరోదాన్ని విశాఖలోని జంతు ప్రదర్శనశాలకు తరలించారు. మరో రెండింటి నివేదికలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news