ప్రజలపై భారం మోపం అని చెప్పి.. విద్యుత్ చార్జీల రూపంలో పెనుబారం వేస్తున్నారు అని మాజీ డిప్యూటీ సీఎం దర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. పన్నుల పై బాదుడే బాదుడంటూ గతంలో ప్రచారం చేసి ఇప్పుడు.. ప్రజల పై ఛార్జీలు పెంచుతున్నారు. మీ మాటలు నమ్మి ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలపై భారం మొపుతున్నారు అని పేర్కొన్నారు.
అలాగే మమల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కక్షసాధింపులు చేసినా మేం భయపడం. మేం అన్ని రంగాల వారికి సంక్షేమ పథకాలు ఇచ్చాం. కానీ ఇప్పుడు మీ సూపర్ సిక్స్ ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన నుండి వైసీపీ కేడర్ పై కక్ష్య సాధింపులు చేస్తున్నారు ఇది ధర్మంకాదు. జగన్ చేసింది అర్దం కాక.. ఆత్యాశకు పోయి ఓటర్లు మిమ్మల్ని గెలిపించారు. అప్పుడు ఓక్క రూపాయి పెంచమని.. ఇప్పుడు ఛార్జీలు పెంచుతున్నారు. మాది మంచి ప్రభుత్వం అంటారు మీరు.. కానీ ప్రజలకు మభ్యపెట్టి భారం వేయవద్దు. మీలో మార్పు రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నా అని ధర్మాన కృష్ణ దాస్ అన్నారు.