అచ్చెన్న టీం లో కొత్త వ్యక్తి చేరాడు!

అచ్చెన్నాయుడు టీం ఏమిటి.. కొత్త వ్యక్తి చేరడం ఏమిటి అనే సందేహం రావొచ్చు! దీంతో… అచ్చెన్నాయుడు టీడీపీలో ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నాడా.. లేక, కొత్త కుంపటి పెట్టబోతున్నాడా.. అదీ గాక ఎన్ టీఆర్ కు చంద్రబాబు చేసినట్లుగా.. అచ్చెన్నా చంద్రబాబుకు చేయబోతున్నాడా అని కూడా అనిపించొచ్చు అయితే… అది ఆ టీం కాదు! ఇ.ఎస్.ఐ. స్కాం టీం!

అవును.. రాజకీయ నాయకుడిగా అచ్చెన్నాయుడు ఎంత ఫ్యామస్ అయ్యారో ఇ.ఎస్.ఐ. కుంభకోణం విషయంలో అంతకు మించి పాపులర్ అయ్యారు! ఎవరూ ఊహించని రీతిలో అరెస్టవ్వడం, అనంతరం ఆయనకు అస్సలు ఆరోగ్యం సహకరించకపోవడం, ఆ పేరుమీద బెయిల్ వచ్చేవరకూ హాస్పటల్ లోనే రెస్ట్ తీసుకోవడం తెలిసిన విషయమే! అయితే ఈ కేసుకు సంబందించి తాజాగా దినేశ్‌ కుమార్‌ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రొడిగి కంప్యూటర్స్‌ అండ్‌ ల్యాప్‌టాప్స్‌ సంస్థకు అధిపతి అయిన దినేశ్‌ కుమార్‌ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 2017లో బయో మెట్రిక్‌ పరికరాల విక్రయాల్లో అప్పటి ఇ.ఎస్.ఐ. డైరెక్టర్‌ రమేశ్‌ కుమార్‌ తో కుమ్మక్కై రూ.53.67లక్షలు ప్రభుత్వానికి నష్టం చేకూర్చినట్లు దర్యాప్తులో తేలడంతో.. దినేశ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు! దీంతో… అచ్చెన్న టీంలో మరో వ్యక్తి చేరినట్లయ్యింది!! తవ్వేకొద్దీ కొత్త విషయాలు ఈ అచ్చెన్న స్కాం లో వెలుగులోకి వస్తున్నట్లున్నాయి!!