ఇవాళ్టి నుంచి ఏపీలో అల్పెండజోల్ 400 ఎంజి టాబ్లెట్ పంపిణీ

-

ఇవాళ్టి నుంచి ఏపీలో అల్పెండజోల్ 400 ఎంజి టాబ్లెట్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. నేడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది ఆరోగ్య శాఖ. ఈ సందర్భంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ…. 1-19 మధ్య వయసు వారికి కోటీ 10 లక్షల ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగు మాత్రల పంపిణీ చేస్తామన్నారు. పిల్లల్లో నులిపురుగులు, రక్తహీనత నివారణకు ఈ మాత్రను తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు. పిల్లలు తిన్న ఆహారం వంటపట్టేందుకు కూడా ఈ మాత్ర ఎంతగానో పనిచేస్తుందన్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక ఒక మాత్రను ఒకసారి మాత్రమే వేసుకోవాలని స్పష్టం చేసారు. 1-2 మధ్య వయసు గల పిల్లలు సగం మాత్రను వేసుకోవాలని… 2-19 మధ్య వయసున్న పిల్లలు మాత్రను మొత్తం వేసుకోవాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news