ఐపీఎల్ పుణ్యమా అని గత రెండు సీజన్ లుగా ముంబై ఇండియన్స్ తరపున నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కు అదృష్టం మాములుగా లేదు. మొదటిసారి ఇండియా తరపున అంతర్జాతీయ స్థాయిలో టీ 20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ యంగ్ ప్లేయర్ ఇప్పుడు వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న అయిదు మ్యాచ్ ల సిరీస్ లో నిలకడగా రాణిస్తున్నాడు. మూడు మ్యాచ్ లలో తిలక్ వర్మ 39 , 52 మరియు 49 నాట్ అవుట్ పరుగులు చేసి ఇండియా సెలెక్టర్ లను ప్రత్యేకంగా ఆకర్శించాడు. ఇతని బ్యాటింగ్ లో టెక్నిక్, కంట్రోల్, క్వాలిటీ అన్ని చాలా చక్కగా బాలన్స్ చేస్తూ పరుగులను చేస్తున్నాడు. ఈ సందర్భంగా చాలా మంది అభిమానులు మరియు క్రికెట్ విశ్లేషకులు త్వరలో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ లోకి తీసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే.. కె ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ , పంత్ లు గాయాల కారణంగా ఇంకా ఆడేది లేదా అన్నది తెలియడం లేదు. ఇక ప్రస్తుతం జట్టులో ఉన్న సూర్య వన్ డే లలో విఫలం అవుతున్నాడు, సంజు శాంసన్ తడబడుతున్నాడు.
అందుకే తిలక్ వర్మ కు ఇదే సరైన సమయం అంటూ ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సెలెక్టర్లు తిలక్ వర్మకు ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.