ఏపీ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. త్వరలోనే అసైన్డ్ భూముల పంపిణీ చేయనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ యోగ్యమైన అసైన్డ్ భూముల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికి 60వేల ఎకరాలను గుర్తించింది.
భూముల లభ్యత ప్రాంతాన్ని బట్టి అర ఎకరం నుంచి రెండు ఎకరాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీపావళి పండుగలోపు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు సమాచారం. త్వరలోనే తేదీలు ఖరారు కానున్నాయి.
కాగా, విశాఖలో నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రూ.1,624 కోట్లు వాస్తవ రూపంలోకి పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ సందర్బంగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా నాలుగు యూనిట్ల ప్రారంభోత్సవాలు జరుగుతాయి. మరో రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన కూడా జరుగనుంది.ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 4,160 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.