రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ సర్కార్ శుభవార్త

-

రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ సర్కార్‌ అదిరిపోయే న్యూస్‌ అందించింది. రేషన్ కార్డులు ఉన్నవారికి సెప్టెంబర్ నుంచి ఫార్టీఫైడ్ బియ్యాన్ని పిడిఎస్, ఎండిఎం, ఐసిడిఎస్ ల ద్వారా పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. పలు జిల్లాల్లో ఇప్పటికే అమలవుతుండగా… మిగతా జిల్లాలకు సెప్టెంబర్ నుంచి విస్తరిస్తామన్నారు.

ఫార్టీఫైడ్ బియ్యం రక్తహీనతను నిరోధిస్తుందని, దీనితో దీనిలో బి12 విటమిన్ తో నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాగా, ఇవాళ వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులు విడుదల చేయనుంది ఏపీ సర్కార్‌. ఇందులో భాగంగగానే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులకు రూ. 1358.78 కోట్లను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news