తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త. తిరుమలలో టీటీడీకి కొత్తగా 10 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఉచిత రవాణా సేవలు అందిస్తున్న టీటీడీ ధర్మరతం బస్సుల స్థానంలో ఓలేక్ట్రా కంపెనీకి చెందిన 10 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.
ఈ మేరకు అన్నమయ్య భవనంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్ జిఎం శేషారెడ్డికి ఎలక్ట్రిక్ బస్సులను అందించే అంగీకార పత్రాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో ఓలేక్ట్రా కంపెనీకి సీఎండి ప్రదీప్ అందజేశారు. సామాన్యులకు నాణ్యమైన జీవనాన్ని అందించాలని లక్ష్యంతో ఎంఈ ఐఎల్ టిటిడి కి 10 ఎలాస్టిక్ బస్సులను అందిస్తుంది.
క్తుల కోసం ఈ బస్సులను తిరుమల కొండ పైన నడపనున్నారు. వచ్చే ఎడాది మార్చి నాటికి ఈ పది బస్సులను టీటీడీకి అందించనున్నారు. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈ పది బస్సులు చేరుస్తాయి. తొమ్మిది మీటర్ల పొడవు ఉండే ఈ ఎయిర్ కండిషన్ బస్సులో డ్రైవర్ తో కలిపి 36 సీట్లు ఉంటాయి.