తేజ ‘అహింస’ నుండి దీవాళీ టపాస్ సాంగ్ !

-

టాలీవుడ్ సూపర్ హిట్ ప్రొడ్యూసర్, ఎస్పీ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు రెండో తనయుడు అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తేజ దర్శకత్వంలో అహింస మూవీతో అభి టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు.

ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్స్, ఆడియో పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక దీపావళి పండుగని పురస్కరించుకొని ఈనెల 24న ఉదయం 9 గం. 9 ని. లకు అహింస మూవీ నుండి దివాళి టపాస్ సాంగ్ అయిన అమ్మేశానే అనే పల్లవి తో సాగే మాస్ బీట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఆకట్టుకునే కథ, కథనాలతో యాక్షన్ తో కూడిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అహింస మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version