లోన్ యాప్ ల ద్వారా లోన్ లు తీసుకోవద్దు – విశాఖ పోలీస్ కమీషనర్ శ్రీకాంత్

-

గత కొద్ది రోజులు నుంచి లోన్ యాప్ లపై ఫిర్యాదు వస్తున్నాయన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్. విశాఖ పోలీస్ కమిషనరేట్ కు ఫిర్యాదు అందిందని.. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు తో సైబర్ క్రైమ్ కేస్ విచారణ చేశామన్నారు. జయశంకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారు చైనా నుంచి అకౌంట్లు నిర్బహిస్తున్నట్లు గుర్తించామన్నారు.
సుమారు వంద కోట్ల లావాదేవీలు చేశారని.. నిందితుడుకి కోటి రూపాయలు కమిషన్ వచ్చిందన్నారు.

మే నెలలో ఒక లోన్ అప్ ను బాధితురాలు డౌన్ లోడ్ చేసుకుందని.. 5వేలు లోన్ కోసం లోన్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు 12 వేలు కట్టినా కూడా బాధితురాలిని విడిచి పెట్టలేదని.. లోన్ యాప్ లు కాంటాక్ట్ మరియు..ఫోన్ గ్యాలరీ యాక్సిస్ అడుగుతోందని తెలిపారు. అపుడు అంగీకరిస్తే మొత్తం కాంటాక్ట్, ఫోటో, మొత్తం డేటా ను దొంగిలించి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. పేమెంట్ గేట్ వే ద్వారా చెల్లింపు చేస్తున్న సమయంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్.

కెవిన్ వాంగ్ అనే వ్యక్తి కీలక సూత్రధారి గా గుర్తించామన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా జయ సింహ రెడ్డి , వాంగ్ ల మధ్య కమ్యూనికేషన్ జరిగిందన్నారు. చైనా లో ఉండి ఆర్ధిక లావాదేవీలు చేశారని.. క్రిప్టో కరెన్సీ గా మార్చుకుంటున్నారని తెలిపారు. ఎన్నో అకౌంట్లు వినియోగించిన కనీసం బ్యాంక్, ఐటి సంస్థలు ఎలాంటి విచారణ జరపలేదన్నారు. లోన్ యాప్ లు ద్వారా లోన్ లు తీసుకొద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news