AP : ఏపీలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండనుంది. భారీ వర్షాల కారణంగా ఇవాళ మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
తుఫాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.
కాగా, నెల్లూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 16.4 సెంటీ మీటర్ల వర్ష పాతం కురిసింది. మనుబోలు…సైదాపురం.. నెల్లూరు..వెంకటాచలం మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వర్షం నిలిచిపోవడంతో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగరంలో దశల వారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగనుంది.