ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు

-

Cyclone Michaung : మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీతో పాటు చెన్నై రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. అంతేకాదు.. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏపీలో 9 జిల్లాలకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

AP-heavy-Rains up to 3 days

ఏపీలో మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, కడప, తూ.గో., కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సర్కార్‌. ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం,విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది సర్కార్‌.

కాగా, నెల్లూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 16.4 సెంటీ మీటర్ల వర్ష పాతం కురిసింది. మనుబోలు…సైదాపురం.. నెల్లూరు..వెంకటాచలం మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వర్షం నిలిచిపోవడంతో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగరంలో దశల వారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news