ఆంధ్రప్రదేశ్ లో మే 13న అటు 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన రోజు నుంచే కూటమి, వైసీపీ నేతల మధ్య వివాదస్పద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసం చేయడం.. పలువురు నేతలు కొట్టుకోవడం లాంటి సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై చర్చ జరుగుతోంది.
ఇటీవలే పోస్టల్ బ్యాలెట్ లో ఆర్ఓ సంతకం లేని ఓట్లు కూడా చెల్లుతాయని కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కొన్ని నిబంధనలను సడలించింది ఈసీ. పోస్టల్ బ్యాలెట్టుపై ఆర్వో సీల్ లేదా సంతకం లేకున్నా లెక్కించవచ్చన్న ఈసీ నిబంధనల పై సడలింపు పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్దంగా సడలింపు జరిగిందని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఓటమి భయంతోనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ రాద్దాంతం చేస్తోందంటోన్న టీడీపీ. ఆర్వోలు చేసే తప్పిదానికి తమ ఓటు మురిగిపోవడం కరెక్ట్ కాదంటున్నారు ఉద్యోగ సంఘాలు.సుమారు 5 లక్షల మేర పోస్టల్ బ్యాలెట్ వినియోగించారు.