ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు రావాలని సూచించింది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉన్నాడు.
తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం సౌత్ గ్రూపులో మాగుంట కీలక వ్యక్తిగా భావిస్తూ విచారణకు రావాలని కోరినట్లుగా తెలుస్తోంది. అటు ఇదే కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి మరోసారి నోటీసులు పంపింది. మార్చి 20న విచారణకు రావాలని కవితను ఆదేశించింది. ఇక ఈ కేసులో కీలకంగా భావిస్తున్న రామచంద్ర పిళ్ళై ని ఈడీ కస్టడీ పొడగిస్తూ కోర్టు నిర్ణయం వెలువరించింది. ఇప్పుడు వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు ఇవ్వడం ఈ కేసులో కీలకంగా మారుతుంది.