పటేల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ… బాబు గుండెల్లో రైళ్లు!!

-

కాంగ్రెస్ వృద్ధ నేత, గాంధీ కుటుంబానికి అమిత ప్రియుడు అహ్మద్ పటేల్ ని వరుసగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తుండటం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అదేమంటే… మనీల్యాండరింగ్‌ కేసు, సందేశార సోదరుల బ్యాంకు స్కామ్‌లకు సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్ పటేల్ ను ఈడీ అధికారులు తాజాగా నాలుగోసారి కూడా ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం అహ్మద్‌ పటేల్‌ను సుదీర్ఘంగా విచారించింది. ఈ దఫా పలు కీలకమైన ప్రశ్నాస్త్రాలను అహ్మద్ పటేల్ పై సంధించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఆయనను చివరిసారిగా ఈడీ ఈనెల 2వ తేదీన పదిగంటల పాటు ప్రశ్నించింది. ఈడీ అధికారులు మూడు సెషన్స్‌లో తనను 128 ప్రశ్నలు అడిగారని అంతకుముందు అహ్మద్‌ పటేల్‌ వెల్లడించారు.

అయితే ఇది నిజంగా రాజకీయ వేధింపుల చర్యలో భాగంగా సాగుతున్న విచారణే అని…. ఎవరి ఒత్తిళ్లపై ఈ ఈడీ అధికారులు పనిచేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని కూడా అహ్మద్ పటేల్ వివరించారు. కాగా జూన్‌ 27, జూన్‌ 30, జులై 2న మూడుసార్లు అహ్మద్‌ పటేల్‌ను విచారించిన ఈడీ అధికారులు ఇప్పటివరకూ 27 గంటల పాటు ప్రశ్నించారు. మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద అహ్మద్‌ పటేల్‌ ప్రకటనను ఈడీ అధికారులు రికార్డు చేశారు.

అయితే వడోదరకు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌ ప్రమోటర్లు నితిన్‌ సందేశార, చేతన్‌ సందేశార, దీప్తి సందేశర బ్యాంకు నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. వారంతా పరారీలో ఉన్నారు. కాగా ఈ వ్యవహారంతో అహ్మద్‌ పటేల్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే వ్యవహారంపై ఈడీ అధికారులు మరోసారి అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నించారు. స్టెర్లింగ్‌ బయోటెక్‌ ప్రమోటర్లతో అహ్మద్ పటేల్ కు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి అహ్మద్ పటేల్ ను అధికారులు చాలా సుదీర్ఘంగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల సమయంలో పలువురితో, పలు రాష్ట్రాలతో సంబంధాలను పెట్టుకొని అహ్మద్ పటేల్ మనీ ల్యాండరింగ్ ను నడిపారు. ఆ కేసులు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు హస్తం కూడా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం వచ్చింది. దీంతో అక్కడ అహ్మద్ పటేల్ ను ఈడీ ప్రశ్నిస్తుంటే… ఇక్కడ చంద్రబాబు నాయుడు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news