ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఖాళీ కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం సన్నాహకాలు చేస్తుంది. అయితే MLC షేక్ సాబ్జీ మృతితో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఓటు హక్కు నమోదుకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల టీచర్లకు అవకాశం ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇక ఓటు హక్కు నమోదు అనంతరం ఈ ఏడాది చివరిలో ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
అయితే టీచర్స్ ఎమ్మెల్సీ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫారం -19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ..18న పరిశీలన, 24 జాబితా ప్రకటన ఉండనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత అక్టోబర్ 15 వరకు అభ్యంతరాల స్వీకరణ గడువు.. 30న అభ్యంతరాల పరిశీలన ఉండనుంది. అలాగే నవంబర్ 6న ఓటర్ల తుది జాబితా ప్రకటన ఉంటుంది. అయితే 2021 నాటికి ఉమ్మడి గోదావరి జిల్లాలో 17,467 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త ఓటర్ల నమోదుతో ఏ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.