Electric Scooter: ఏపీలో మంటల్లో కాలిపోయింది ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తణుకు పట్టణంలోని ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికి ఆహుతైంది ఆ ఎలక్ట్రిక్ స్కూటర్. స్థానిక మీనాక్షి మెడికల్స్ యజమాని జి.ముత్యాలరావుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎన్జీవో హోం రోడ్డులోని ఎస్‌బీఐ ఎదురుగా అగ్ని ప్రమాదం జరిగింది.

పార్కింగ్ చేసి ఉండగా అకస్మాత్తుగా బ్యాటరీ నుంచి చెలరేగాయి మంటలు. తణుకు అగ్నిమాపక శాఖ అధికారి ఐ.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది సిబ్బంది. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.