నేడు మాజీ సీఎం నారా చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ఉండనుంది. ఈ ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు జైలు అధికారులు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబును కలవనున్నారు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి. జైలులో చంద్రబాబుకు వ్యక్తిగత సహాయకుడిగా మాణిక్యం ఉన్న సంగతి తెలిసిందే.
అత్యంత పటిష్టమైన భద్రతలో స్నేహ బ్లాక్ ఉంది. ఎమర్జెన్సీ కింద నలుగురు వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక రాజమండ్రి లోనే ఉన్న భువనేశ్వరి, నారా బ్రహ్మిణి ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నారని టీ డీ పీ వర్గాలు చెబుతున్నాయి. ములాఖత్ సమయం ఫిక్స్ అయిన తర్వాత తొలుత లోకేష్ క్యాంప్ దగ్గరికి వచ్చి.. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అటు కాతేరు వద్ద వున్న వెంకటాద్రి గార్డెన్స్ లో
TDP పోలిట్ బ్యూరో సభ్యులతో లోకేష్ సమావేశం నిర్వహించనున్నారు.