డిగ్రీలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సు.. ఆ విద్యార్థులకు తప్పనిసరి

-

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని కొత్త రూట్లు వెతికినా.. ఎన్ని నూతన విధానాలు తీసుకువచ్చినా వారు చిక్కడూదొరకడూ అన్న మాదిరిగా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు.. వాటిని నిర్మూలించడమే లక్ష్యంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సును ప్రవేశపెట్టింది తెలంగాణ విద్యా శాఖ.

సైబర్‌ సెక్యూరిటీ పేరిట రూపొందించిన ఈ కోర్సును విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి తదితరులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్షకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ సెకండియర్‌లో సైబర్‌ సెక్యూరిటీ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

సైబర్ సెక్యూరిటీ కోర్సు ప్రత్యేకతలు ఇవే..

  • డిగ్రీ సెకండియర్‌లో నాలుగో సెమిస్టర్‌లోని బీఏ, బీకాం, బీఎస్సీ వంటి అన్నిరకాల కోర్సుల విద్యార్థులు సైబర్‌ సెక్యూరిటీ కోర్సును పూర్తిచేయాల్సిందే.
  • ఇందులో ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ, బేసిక్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ గవర్నెన్స్‌ అం డ్‌ సైబర్‌ లాస్‌, ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ సైబర్‌ క్రై మ్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సెక్స్‌, సోషల్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ, ఈకా మర్స్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ మాడ్యూ ల్స్‌ ఉన్నాయి.
  • 100 మార్కులున్న ఈ కోర్సును పూర్తిచేస్తే నాలుగు క్రెడిట్స్‌ జారీచేస్తారు. ప్రాక్టికల్స్‌కు 30మార్కులు, థియరీ ఎగ్జామ్‌ 70 మార్కులకు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news