ఏపీ ప్రజలకు శుభవార్త. జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల్లో ఏపీ ఫైబర్ నెట్ వాడేలా కీలక నిర్ణయం తీసుకున్నామని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ను తొలగించి బయటి నెట్వర్క్ లను వినియోగిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు.
బుధవారం విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా సొంత యాప్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చార్జీలు పెడతామంటూ ప్రచారం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ బేసిక్ చార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు. త్వరలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో నెట్ బాక్సుల సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.