జగన్‌ సర్కార్‌ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు – ఫిలిం ఎగ్జిబిటర్స్ ఆగ్రహం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి మరో దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌ సినిమా టికెట్ల విక్రయంపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్ల జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాల్సిందిగా జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు. అయితే దీనిపై ఫిలిం ఎగ్జిబిటర్స్ స్పందించారు.

జగన్‌ సర్కార్‌ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని.. దాంతో హై కోర్ట్ ను ఆశ్రయించాని ఫిలిం ఎగ్జిబిటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హై కోర్ట్ స్టే సంతోషమని.. ఎట్టకేలకు ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్ పై స్టే వచ్చిందని పేర్కొన్నారు. ఎం ఓ యూ లపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారని… జీవో 69 ని మేం వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

మా సాధక,బాధలు ఎన్ని సార్లు చెప్పిన అధికారులు లెక్కచెయ్యలేదని.. బుక్ మై షో ద్వారా ప్రభుత్వానికి మేమే లింక్ ఇస్తామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో చేస్తాం..ప్రభుత్వం మాపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ళు లైసెన్స్ ఇవ్వాలి…కానీ ఏడాది కి మాత్రమే ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version