ఏపీలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్య ఆస్పత్రుల్లోనే ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా.. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కరోనా పేషెంట్లు పరుగులు తీశారు. అయితే.. ఐడీవార్డులో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అయితే.. ముందుగా పొగరాగానే సిబ్బంది అప్రమత్తమై వెంటనే కరోనా పేషెంట్లను ఇతర గదిలోకి తరలించారు. దీంతో అందరూ క్షేమంగా ఉన్నారు.

విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్ల కొవిడ్రోగులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, తమను కాపాడిన ఆస్పత్రి సిబ్బందిపై పేషెంట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.