తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆన్లైన్ క్లాసులపై మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ఒకటి నుంచి 5వ తరగతి వరకు రోజుకు గంటన్నరపాటు రెండు క్లాసులు, 6 నుంచి 8వ తరగతి వరకు రోజుకు 2 గంటల చొప్పున మూడు క్లాసులు బోధించాల్సి ఉంటుంది. ఇక 9 నుంచి 12వ తరగతి వరకు రోజుకు 3 గంటల పాటు 4 క్లాసులు బోధించాలలి. అలాగే ఇంటర్ సెకండియర్, డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కళాశాలల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్నారు.
ఇకపోతే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాసులు ప్రారంభించనుంది.