ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి ప్రతిపక్ష హోదా కల్పించాలని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ కి కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా పొందే అవకాశం లేదన్నారు.
మొత్తం సభ్యుల్లో పదో వంతు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. జగన్ కేవలం ఫ్లోర్ లీడర్ మాత్రమేనని.. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారు. 1984లో రాజ్యసభ ఎంపీ ఉపేందర్, 1994లో జనార్దన్ రెడ్డిలకు ప్రతిపక్ష హోదా కాదు. ఫ్లోర్ లీడర్ హోదా మాత్రమే ఉంది అని వివరించారు. ప్రజల దగ్గరకు వెళ్లి మొఖం చూపించుకోలేక జగన్ రెడ్డి కుయుక్తులకు తెరలేపారని, స్పీకర్ ఎన్నిక రోజు కూడా వైసీపీ నేతలు ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదని గుర్తు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.