తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు వీధుల్లో కుక్కలు దాడి చేస్తుంటే.. మరోవైపు అడవీలో పులి దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇటీవలే ఓ మహిళపై ఏకంగా కుక్కలు దాడి చేసిన ఘటన మరిచిపోకముందే.. మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో ఓ చిరుత మహిళ పై దాడి చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూలు జిల్లా , నంద్యాల, గిద్దలూరు బోర్డర్ ఘాట్ రోడ్డు పచ్చర్ల లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
పచర్ల లో మహిళ పై చిరుత దాడి చేసింది. దీంతో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా అక్కడే మరణించింది. కట్టెల కోసం అడవి సమీపంలో ఉన్న వంకా కూ వెళ్లిన మహిళ పై దాడి చేసి , చంపి , తలను తినేసింది చిరుత. ఆ మహిళా కేకలు వేయడంతో స్థానికులు వంక వద్దకు వెల్లెలోపు చంపి తినేసింది చిరుత.ఇటీవల సంచరిస్తుూ నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీ పై దాడి చేసి గాయపరిచింది. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లు అటవీ అధికారులు ఏర్పాటు చేసారు ఫారెస్ట్ అధికారులు. చిరుత కోసం అటవీ అధికారుల గాలిస్తున్నారు. అడవి జంతువుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు ప్రజలు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరైనా స్పందించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.